సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఢిల్లీలో ప్రారంభమైన అంతర్జాతీయ వ్యాపార మేళా (National Capital | Delhi | International Business mela | Pragathi Maidan)
Feedback Print Bookmark and Share
 
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదానంలో 29వ అంతర్జాతీయ వ్యాపార మేళా శనివారం ప్రారంభమౌతోంది. ఈ మేళాను రాష్ట్రపతి ప్రతిభా దేవీ సింహ్ పాటిల్ ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు.

నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ మేళా 27 వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది కొన్ని మార్పులు చేసామని, ఇందులో 18వ తేదీ వరకు ప్రజలను అనుమతించమని, మేళా తొలి ఐదు రోజులు బిజినెస్ క్లాస్‌ కొరకు వినియోగిస్తున్నామని, ప్రజల సందర్శనార్థం నవంబర్ 19 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు అనుమతిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారని నిర్వాహక బృందం ప్రకటించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.