ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » వడ్డీ రేట్లు తగ్గించిన ఐడిబిఐ, సెంట్రల్ బ్యాంకులు (India | Banking Sector | Interest Rates | Central Bank | IDBI | SBI,)
దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన భారతీ స్టేట్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడంతో దేశంలోని మరికొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐడిబిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు వడ్డీ రేట్లను తగ్గించాయి.
ప్రస్తుతం దేశంలో రుణాలకు డిమాండ్ తగ్గడం, బ్యాంకుల దగ్గర మిగులు నిధులుండటంతో వడ్డీ వ్యయ నియంత్రణపై బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐడిబిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 0.25 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
అలాగే మరిన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడ్డారు.