సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మార్కెట్లోకి ఒలివా స్కిన్, హెయిర్ ఉత్పత్తులు (Finance| Oliva| Skin| Hair Care| Products| News)
Feedback Print Bookmark and Share
 
హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్‌ హోలిస్టిక్‌ రెమిడీస్‌ సంస్థ ఓలివా బ్రాండ్‌ పేరిట అడ్వాన్స్‌డ్‌ స్కిన్‌, హెయిర్‌ కేర్‌ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.రోశయ్య ఒలివా ఉత్పత్తులను లాంఛనంగా విడుదల చేశారు. శ్రేయాస్‌ సంస్థ బంజారా హిల్స్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లిలో ఈస్తటిక్‌ క్లినిక్కులను నిర్వహిస్తోంది.

నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వల్ల శారీరక లోపాలను, వికారాలను జయించి అందమైన రూపు సంతరింపచేసుకోవడానికి శ్రేయాస్‌ వంటి సంస్థ అందుబాటులో ఉండడం ముదావహమని రోశయ్య అన్నారు.

ఈ సందర్భంగా శ్రేయాస్‌ మెడికల్‌ డైరక్టర్‌ డాక్టర్‌ సోమా ప్రశాంత్‌ మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలతో పాటు, భవిష్యత్‌లో దక్షిణాదంతటా తమ క్లినిక్కులను విస్తరిస్తామని పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.