సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » విదేశీ ప్రాజెక్టుల ఏర్పాటును రద్దు చేసిన నాల్కో (Finance| Nalco| National Aluminum company| Indonesia| Iran| South Africa)
Feedback Print Bookmark and Share
 
నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) అంతర్జాతీయ కార్యకలాపాల విషయంలో వెనుకడుగు వేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాలో రూ. 17,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాజెక్టును నాల్కో రద్దు చేసుకుంది. అలాగే రూ. 10,000 కోట్ల పెట్టుబడితో ఇరాన్‌లో ఏర్పాటు చేయదలచిన ప్రాజెక్టును కూడా నిలిపి ఉంచాలని నాల్కో నిర్ణయించుకుంది.

ఈ విషయమై కంపెనీ ఫైనాన్స్ డైరక్టర్ బీఎల్ బాగ్రా మాట్లాడుతూ.. బొగ్గు నిల్వలు లేని కారణంగా అంతర్జాతీయ ప్రాజెక్టుల ఏర్పాటును రద్దు చేయాల్సిన వచ్చిందన్నారు. అయితే రూ. 17,000 కోట్ల పెట్టుబడి అంచనాతో చేపడుతోన్న ఇండోనేషియా ప్రాజెక్టు మాత్రం కొనసాగుతుందని బాగ్రా స్పష్టం చేశారు.

ఇండోనేషియాలో ఐదు లక్షల టన్నుల అల్యూమినియం స్మెల్టర్ ప్లాంట్‌ను, 1, 250 మెగావాట్ల పవర్ ప్లాంట్‌నూ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.