ఆదిత్యా బిర్లా గ్రూపుకు చెందిన ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సమృద్ధి సిమెంట్‌తో విలీనానికి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన సమావేశంలో అల్ట్రాటెక్.. సమృద్ధితో విలీనానికి ఆమోద ముద్ర వేసింది.
గ్రాసిం ఇండస్ట్రీస్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ అయిన సమృద్ధి సిమెంట్‌తో అల్ట్రాటెక్ విలీనం కావడం ద్వారా ప్రపంచంలోనే పదో పెద్ద సిమెంట్ తయారీ సంస్థగా అల్ట్రాటెక్ ఆవిర్భవించనుంది.
అల్ట్రాటెక్- సమృద్ధి సంస్థల విలీనం ఫలితంగా మొత్తం 22 ప్లాంట్ల ద్వారా సిమెంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4.88 కోట్ల టన్నులకు చేరుతుందని అల్ట్రాటెక్ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. విలీనంలో భాగంగా అల్ట్రాటెక్ ఈక్విటీ 274.20 కోట్లకు పెరుగుతుందని ఆ ప్రకటన తెలియజేసింది.