సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » విమాన ఇంధన ధరలు మళ్లీ పెరిగాయ్! (ATF Rates| Jet Fuel| Indian Oil Corporation| Finance| News)
Feedback Print Bookmark and Share
 
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు జెట్ ఫ్యూయల్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల్లో మరోసారి విమానయాన ఇంధన (ఎటిఎఫ్) ధరలు ఆదివారంతో 2.4 శాతం మేర పెరిగాయి. పెంచిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి.

ఇందులో భాగంగా ఢిల్లీలో కిలోలీటరు ఎటిఎఫ్ ధర 948 రూపాయలు పెరిగి 40, 423 రూపాయలు చేరుకున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉన్నతాధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే ముంబైలో ఎటిఎఫ్ ధర కిలో లీటరుకు 988 రూపాయలు పెరిగి 41, 470 రూపాయలకు చేరుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.