సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » వెయ్యిమందికి ఉపాధి కల్పించనున్న హనివెల్! (Finance| Honeywell Automation India| 1,000 Employees| Biofuel technology| News)
Feedback Print Bookmark and Share
 
ఆర్థికమాంద్యం కారణంగా ఉద్యోగాల కొరత ఏర్పడిన నేపథ్యంలో.. హనివెల్ కంపెనీ వచ్చే ఏడాది వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఆర్థికమాంద్యం నుంచి కోలుకుంటామనే ధీమాతోనే వచ్చే ఏడాది 1000 మందికి ఉపాధి కల్పించేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటుందని హనివెల్ ఆటోమ్యాషన్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ విపుల్ కపూర్ తెలిపారు.

ఎయిర్‌లైన్ ఇండస్ట్రీస్‌కు విమాన ఇంధనం బయోఫ్యూయల్ టెక్నాలజీ అందజేసేందుకు హనివెల్ ప్రణాళికలు రూపొందిస్తోందని కపూర్ అన్నారు. ఈ ఏడాది అభివృద్ధి ఆశించినంతగా లేకపోవడంతో 500-700 మందికి మాత్రమే ఉపాధి కల్పించగలిగామని విపుల్ కపూర్ చెప్పారు. తమ కంపెనీ సేవల విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది తప్పకుండా వెయ్యిమందిని ఉద్యోగాల్లో నియమించేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.