ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » తగ్గిన ముడి చమురు ఉత్పత్తులు: సిఎమ్ఐఈ (FY | FH | Crude Oil | Production | CMIE | Gas | kg basin gas | RIL | ONGC)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దేశీయ ముడి చమురు ఉత్పత్తులు దాదాపు 1.2 శాతం తగ్గాయి. దేశీయ ముడి చమురు ఉత్పత్తి కంపెనీ అయిన ఓఎన్‌జీసీలో ఉత్పత్తులు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సిఎమ్ఐఈ) తన తాజా నివేదికలో పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ముడి చమురు ఉత్పత్తులు 1.2 శాతం తగ్గి 166 లక్షల టన్నులకు చేరుకుందని సిఎమ్ఐఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. నిరుడు జరిగిన ఉత్పత్తులతో పోలిస్తే ఇది 1.2 శాతం తగ్గిందని ఆ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఓఎన్‌జీసిలో ముడి చమురు ఉత్పత్తుల్లో 3.7 శాతం తగ్గి 123 లక్షల టన్నులకు చేరుకుందని సిఎమ్ఐఈ వివరించింది.
ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ముడి చమురు ఉత్పత్తులు పెరగగలవని సిఎమ్ఐఈ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా కేయర్న్ ఇండియా సంస్థకు చెందిన రాజస్థాన్‌లోని మంగళా క్షేత్రంలో ఉత్పత్తులు నిరుడు ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తులతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో జరిగిన ఉత్పత్తులు పెరిగాయి. ఇది దాదాపు ప్రతిరోజు ఇరవై వేల బ్యారెళ్ళ ముడి చమురు ఉత్పత్తి జరిగినట్లు సిఎమ్ఐఈ తెలిపింది.
అదే గ్యాస్ ఉత్పత్తి రంగానికి వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 28.2 శాతం పెరుగుదల కనపడిందని సిఎమ్ఐఈ తన నివేదికలో పేర్కొంది. ఈ పెరుగుదల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తులు ప్రారంభం కావడంతో ఈ పెరుగుదల నమోదైనట్లు ఆ సంస్థ వెల్లడించింది.
రిలయన్స్ సంస్థ సెప్టెంబర్, 09లో కేజీ బేసిన్ నుంచి గ్యాస్ ఉత్పత్తులను పెంచుకుంది. దీంతో ప్రతి రోజు నాలుగు కోట్ల ఘనమీటర్ల గ్యాస్ ఉత్పత్తి పెరిగింది. దేశీయ గ్యాస్ ఉత్పత్తిలో ఒక్క కేజీ బేసిన్ గ్యాస్ ఉత్పత్తి శాతం 30 శాతంగా ఉండింది. అదే ప్రథమార్థంలో రిఫైనరీ ఉత్పత్తుల్లోను 3.6 శాతం తగ్గుదల నమోదైంది. దీంతో 779.9 లక్షల టన్నులకు పడిపోయిందని సిఎమ్ఐఈ తన నివేదికలో పేర్కొంది.