ఈ ఏడాది జనవరి నెలలో కుంభకోణం జరిగిందని సత్యం కంప్యూటర్స్ సంస్థ అధినేత రామలింగరాజు ప్రకటించడంతో ఆ కేసు నవంబర్ నెల 26కు వాయిదా పడింది.
సత్యం కుంభకోణం కేసులో ముద్దాయిలపై నేరాభియోగాలను నమోదు చేయాలని సిబిఐ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై సత్యం తరపు న్యాయవాదులు అభ్యంతరం లేవనెత్తారు.
దీంతో ఈ కేసు విచారణకై నవంబర్ నెల 3న ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు జీఓ విడుదల చేసిందని సత్యం సంస్థ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.