నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పప్పుదినుసులు, మాంసం, మసాలా దినుసులు నవంబర్ 7తో ముగిసిన వారాంతంలో నిరుడు ఇదే కాలానికి పెరిగిన ధరలతో పోలిస్తే దాదాపు 14.55 శాతానికి పెరిగింది.
గురువారం ప్రభుత్వం విడుదల చేసిన నివేదికననుసరించి ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు నవంబర్ 7తో ముగిసిన వారాంతానికి 14.55 శాతం పెరిగాయి. అదే నిరుడు ఇది 13.68 శాతంగా ఉండిందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.
గడచిన వారంలో ఉద్దిపప్పు ధరలు 9 శాతం, మాంసం, పెసరపప్పు, చెరి నాలుగు శాతం, అదే మసాలా దినుసులు, గోధుమలు, సద్దలు, జొన్నల ధరల్లో మూడు శాతం పెరుగుదల కనపడిందని ప్రభుత్వం తన నివేదికలో తెలిపింది.
ఇదిలావుండగా పౌల్ట్రీ చికెన్, పండ్లు, కూరగాయల ధరల్లో ఒక శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. కాగా బంగాళా దుంపల ధరలు రెండింతలు పెరిగాయని, అదే ఉల్లిపాయల ధరల్లో ఏకంగా నలభై శాతం పెరిగి రికార్డు సృష్టించాయి.