సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » తపాలా శాఖతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఒప్పందం (FinanceI NewsI Postal DepartmentI ICICI Prudential)
Feedback Print Bookmark and Share
 
భారత తపాలా శాఖతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ జీవిత బీమా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఇకపై రాష్ట్రంలోని అన్ని తపాలా కార్యాలయంలో ఐసిఐసిఐ బీమా ఉత్పత్తుల విక్రయం జరుగుతుంది.

150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన భారత తపాలా శాఖకు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో సైతం కార్యాలయాలు ఉన్నాయని ప్రూడెన్షియల్‌ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, విక్రయాల విభాగం అధిపతి అనూప్‌ రావ్‌ గుర్తు చేశారు. వీటిని అందు బాటులోకి తెచ్చుకోవడం ద్వారా తమ బీమా ఉత్పత్తులు ప్రజలకు మరింత చేరువవుతాయని అనూప్‌ అన్నారు.

ఖాతాదారులకు కావాల్సిన అన్ని రకాల దీర్ఘకాలిక పొదుపు అవసరాలన్నీ ఒకేచోట లభించే విధంగా తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రూడెన్షియల్‌ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, విక్రయాల విభాగం అధిపతి అనూప్‌ రావ్‌ చెప్పారు.

ఈ ఒప్పందం ద్వారా ఇకపై ఖాతాదారులను తమ అన్ని రకాల ప్రీమియం మొత్తాలను తపాలా శాఖా కార్యాలయాలలో చెల్లించవచ్చునని తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.