ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఎస్‌ఐహెచ్ఆర్ఏ ఆధ్వర్యంలో కేరళలో వార్షిక సదస్సు (SIHRA | Kerala | Tiruvantapuram | Hotel Industry | Tourism | Chennai)
దేశ హోటల్ పరిశ్రమకు సంబంధించిన సాధక బాధకాలపై చర్చించేందుకు తిరువనంతపురంలో దక్షిణ భారత హోటల్ పరిశ్రమ మరియు రెస్టారెంట్ అసోసియేషన్ (ఎస్‌ఐహెచ్ఆర్ఏ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వార్షిక సదస్సు జరుగనుంది. ఈ విషయాన్ని సిరా కార్యదర్శి టి.నటరాజన్ గురువారం చెన్నయ్‌లో వెల్లడించారు.
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబరు 7వ తేదీ నుంచి జరిగే ఈ సదస్సును కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సి.అచ్యుతానందన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలకు చెందిన మంత్రులు, కార్యదర్శులు, మంత్రులు, పాల్గొంటారని చెప్పారు. ఈ వార్షిక సదస్సులో "దేశ పర్యాటక రంగం- గతం నేర్పిన అనుభవాలు మరియు భవిష్యత్ సంపాదన" అనే అంశంపై రెండు రోజుల పాటు చర్చ సాగుతుందన్నారు.
అలాగే, హోటల్ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనన్నట్టు ఆయన తెలిపారు. ఇకపోతే.. దేశ వ్యాప్తంగా కొత్తగా 152 త్రీ స్టార్ కేటగిరీ హోటల్స్ అందుబాటులో కి వచ్చాయని, వీటికి పర్యాటక శాఖ గుర్తింపు లభించిందన్నారు. అంతేకాకుండా, దక్షిణ భారతదేశంలో కొత్తగా 12 స్టార్ కేటగిరీ హోటల్స్ అందుబాటులోకి రానున్నాయని, వీటిలో ఆరు హోటళ్ళు తమిళనాడులోనే నిర్మితమవుతున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి పొందిన హోటల్స్‌లలో 48475 గదులు ఉన్నాయని తెలిపారు. వీటిలో దక్షిణ భారతంలో 664 హోటల్స్ ఉండగా, 38000 హోటల్ గదులు ఉన్నట్టు వివరించారు. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి తోడు.. ముంబై దాడులు దేశ హోటల్ పరిశ్రమ కోలుకోని విధంగా దెబ్బతిన్నదని సిరా అధ్యక్షుడు ఎంపీ.పురుషోత్తమన్ అన్నారు.
వీటికితోడు ప్రపంచాన్ని వణికించిన స్వైన్ ఫ్లూ వైరస్ కూడా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఫలితంగా అటు పర్యాటక రంగంతో పాటు.. ఇటు హోటల్ పరిశ్రమ కోలుకోలేని విధంగా నష్టాలను చవిచూసిందన్నారు. దేశ వ్యాప్తంగా ఆక్యుపెన్సీ రేషియో సరాసరి 12.4 శాతానికి పడిపోయినట్టు వివరించారు. ముఖ్యంగా, ఫైవ్, ఫోర్ స్టార్స్ హోటల్స్ వ్యాపారం బాగా పడిపోయిందని ఎంపీ.పురుషోత్తమన్ తెలిపారు.
హోటల్స్‌లలో రూమ్ యావరేజ్ రేటు 1.9 శాతానికి పడిపోయినట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థి వచ్చే 2010 సంవత్సరానికి గాను గట్టెక్కుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. 2008-09 సంవత్సరంలో దేశ డీజీపీలో పర్యాటక సెక్టార్ భాగస్వామ్యం 6.8 శాతం నుంచి 6.1 శాతానికి పడిపోయినట్టు గుర్తు చేశారు.