సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » భారీగా నష్టపోయిన కింగ్‌ఫిషర్ (Vijay Malya | King Fisher Airlines | FY | Net Loss | Jet Airways | Indigo | Go Air)
Feedback Print Bookmark and Share
 
విజయ్ మాల్యా నేతృత్వంలో నడుస్తున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ నిరుడు ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1,602 కోట్ల నష్టాల్లో మునిగిపోయింది.

దేశీయ ప్రైవేట్ విమానయాన రంగంలో అగ్రగామిగానున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ నిరుడు ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టాలను చవిచూసింది. ఆ నష్టాలు దాదాపు రూ. 1,602 కోట్లుండగా నష్టపోయిన కంపెనీల్లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ ముందుండటం గమనార్హం.

కింగ్‌ఫిషర్ సంస్థ తర్వాతి స్థానంలో జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఉంది. ఈ సంస్థకు వచ్చిన నష్టాలు రూ. 1,032 కోట్లుగా ఉంది.

ఇదిలావుండగా అతి చిన్న విమానయాన కంపెనీ అయిన ఇండిగో మరియు పారామౌంట్ ఎయిర్‌వేస్ సంస్థలు నిరుడు ఆర్థిక సంవత్సరంలో లాభాలను ఆర్జించాయని ఆ సంస్థ అధికారులు వెల్లడించారు.

అధికారుల సూచన మేరకు నిరుడు ఆర్థిక సంవత్సరంలో ఇండిగో విమానయాన సంస్థ రూ. 82.16 కోట్ల లాభాలు ఆర్జించిందని, అదే చెన్నైకి చెందిన కంపెనీ పారామౌంట్ విమానయాన సంస్థ రూ. 7.26 కోట్ల లాభాలను ఆర్జించింది.

కాగా ఇతర బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ అయిన స్పైస్ జెట్, గోఎయిర్ విమానయాన సంస్థలకు క్రమంగా రూ. 352.50, రూ. 22.55 కోట్ల నష్టాలు వచ్చాయి.

అలాగే దేశీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు 2007-08వ ఆర్థిక సంవత్సరంలో రూ. 2,226 కోట్ల నష్టం రాగా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రముఖ పైలెట్ల సమ్మె కారణంగా మరో 65 కోట్ల రూపాయల నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.