సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 2వేల మందిని తొలగించనున్న సోనీ ఎరిక్సన్ (Mobile Handsets | Manufacturing Company | Sonyericson | Employment)
Feedback Print Bookmark and Share
 
మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీదార్లలో అగ్రగామిగానున్న సోనీ ఎరిక్సన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగానున్న తమ సంస్థలలోని ఉద్యోగులను తొలగించనుంది.

మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీదార్లలో అగ్రగామిగానున్న సోనీ ఎరిక్సన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగానున్న తమ సంస్థలలోని ఉద్యోగుల్లో దాదాపు రెండు వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. దీంతో ప్రపంచంలోని పలు కేంద్రాల్లోనున్న సంస్థలలో కొన్నింటిని మూసివేసేందుకు కూడా సిద్ధపడింది.

ముఖ్యంగా భారతదేశంలోని తమ సంస్థపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుందని కంపెనీకి చెందిన అధికార వర్గాలు తెలిపాయి.

ప్రపంచవ్యాప్తంగానున్న తమ సంస్థల్లోని ఉద్యోగులను తొలగించడంతోపాటు మరిన్ని బ్రాంచీలను మూసివేసేందుకు ప్రణాళికలు రూపొందించామని అధికారులు చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.