సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » రోమింగ్ ఛార్జీలు తగ్గించిన ఎయిర్‌టెల్ (NewsI FinanceI RoamingI ChargesI Airtel)
Feedback Print Bookmark and Share
 
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ రోమింగ్ ఛార్జీలను తగ్గించింది. కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఎయిర్‌టెల్ టర్బో కింద రోమింగ్ ఛార్జీలను దాదాపు 60శాతం తగ్గించింది.

రోమింగ్‌లో ఉండి సొంత సర్కిల్‌లోని ఫోన్లకు, దూర ప్రాంతానికి చేసే కాల్స్‌కు మాత్రం నిమిషానికి 80 పైసలు వసూలు చేస్తారని, రోమింగ్‌లో ఉన్నప్పుడు వచ్చే అన్ని ఇన్‌కమింగ్ కాల్స్‌కు నిమిషానికి 60 పైసలు రోమింగ్ చార్జీలు వసూలు చేస్తారని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇంకా ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు మాత్రం నిమిషానికి 80 పైసలు ఛార్జీ చేస్తారు. ఈ పథకంలోని మారాలను చందాదారులు రూ. 98 చెల్లించి, రోమింగ్ ఛార్జీల తగ్గింపు ఆఫర్‌ను పొందవచ్చును.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.