ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » వాణిజ్య వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన టాటా (Motor Vehicles | TATA Motors | Chandigarh | TATA-407 Pickup | TATA Super S | TATA S EX)
వాహన నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టాటా మోటార్స్ సంస్థ మూడు కొత్త వాణిజ్య వాహనాలను శుక్రవారం చండీగఢ్‌లోని మార్కెట్లో ప్రవేశ పెట్టింది. వీటిలో టాటా-407 పికప్, టాటా సూపర్ ఎస్, టాటా ఎస్ ఈఎక్స్ వాహనాలున్నాయి.
ఈ సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రతినిధి అనిల్ కపూర్ మాట్లాడుతూ టాటా-407 వాహనాన్ని అత్యంత ఆధునికమైన హంగులతో మార్కెట్లోకి విడుదల చేసామని ఆయన అన్నారు. 2.25 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఈ వాహనంలో ఉందని ఆయన తెలిపారు. తాము మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన ఈ వాహనం చిన్న, చిన్న పల్లెల నుంచి పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో వస్తువులను సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
టాటా సూపర్ ఎస్ వాహనం గురించి ఆయన మాట్లాడుతూ... ఈ వాహనం 70 బిహెచ్‌పి పవర్‌తోపాటు ఐదు గేర్లున్న ఇంజన్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అలాగే పవర్ స్టీరింగ్, పెద్ద పెద్ద టైర్లు, కారులో ఉండేటటువంటి ఆకర్షణీయమైన క్యాబిన్‌ను ఇందులో పొందుపరిచామని అన్నారు. ఈ వాహనం ఒక టన్ను బరువును మోసే సామర్థ్యం కలిగివుందని ఆయన వివరించారు.
తమ వినియోగదారుల కోరిక మేరకు టాటా ఎస్ ఈఎక్స్ వాహనంలోను ఐదు గేర్లున్న ఇంజన్‌ను అమర్చామన్నారు. అలాగే ఇందులో ఆకర్షణీయమైన క్యాబిన్‌ను రూపొందించామని ఆయన తెలిపారు.