సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ట్రెండీ ఫైబర్ గడియారాలు: టైటాన్ (Wrist Watches | Production | TITAN | Sonata | Girls | Davar Hussain)
Feedback Print Bookmark and Share
 
వివిధ రకాల గడియారాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న దేశీయ కంపెనీ అయిన టైటాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ యువతుల అవసరాలను దృష్టిలోవుంచుకుని సొనాటాకు చెందిన కొత్త ట్రెండ్ గడియారాలను ఆ సంస్థ మార్కెట్లో ప్రవేశ పెట్టింది.

తాము తయారు చేసిన ఈ గడియారాలు వేగవంతంగా మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఉత్పత్తుల్లోను మార్పులు చేసి అత్యంత ఆధునికమైన సౌకర్యాలతో కూడుకున్న గడియారాలను తయారు చేసామని కంపెనీ క్షేత్రీయ ప్రతినిధి దావర్ హుస్సేన్ తెలిపారు.

ప్లాస్టిక్ వాచ్ క్యాటగిరీలో సూపర్ ఫైబర్ గరల్స్ పేరుమీద ఈ ప్రత్యేకమైన గడియారాలను మార్కెట్లో ప్రవేశ పెట్టామని ఆయన తెలిపారు.

కొత్తగా ప్రవేశ పెట్టిన గడియారాలు 23 రకాలలో లభ్యమౌతాయని, వీటి ధర రూ. 400ల నుంచి రూ. 475ల మధ్య ఉంటుందని ఆయన వివరించారు.

ఇలాంటి మోడల్ గడియారాలలో డిజిటల్ గడియారాలున్నాయని వీటిలో ఇన్‌సైడ్ లైట్, స్టాప్‌‍వాచ్, అలారంలాంటి సరికొత్త ఫీచర్స్ ఉన్నాయని ఆయన వెల్లడించారు.

తమ కంపెనీ ఎల్లప్పుడూ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వారి అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తుంటుందని ఆయన అన్నారు. దీంతో తమ కంపెనీకి చెందిన గడియారాలలో సరికొత్త మోడల్ గడియారాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.