సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » దేశంలో 50 కోట్ల మందికి చేరువగా టెలికాం సేవలు (Telecom | A.Raja | TRAI | Mobile services | Telecom Ministry)
Feedback Print Bookmark and Share
 
దేశ జనాభాలో సగం మందికి టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం టెలికాం వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం యాభై కోట్లను దాటినట్టు పేర్కొంది. దీన్ని పురస్కరించుకుని కమ్యూనికేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిమాయ్) ఆధ్వర్యంలో టెలికాం శాఖామంత్రి ఏ.రాజాకు ఘనంగా సన్మానం జరిగింది.

ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. మొబైల్ కాల్ ఛార్జీలు తగ్గుతున్నప్పటికీ.. ఎస్ఎంఎస్ ఛార్జీలను కంపెనీలు తగ్గించేందుకు ముందుకు రావడం లేదన్నారు. అందువల్ల ఈ ఛార్జీలను కూడా తగ్గించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ఛైర్మన్‌ జెఎస్‌.శర్మ, సిమాయ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రవిశర్మ, ప్రెసిడెంట్‌ ఎన్‌కె.గోయల్‌, డాట్‌ కార్యదర్శి పీజే.థామస్‌ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.