సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పోర్టింగ్ ఛార్జీలు రూ.19కు మించరాదు: ట్రాయ్ (Porting Charges | TRAI | Services | Mobile number | Call Charges)
Feedback Print Bookmark and Share
 
ఒక మొబైల్ ఆపరేటర్ నుంచి మరొక ఆపరేటర్‌కు మారేందుకు పోర్టింగ్ ఛార్జీని రూ.19కి మించి వసూలు చేయారాదని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది. వచ్చే యేడాది (2010) జనవరి నెల నుంచి వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌‌ను అట్టిపెట్టుకుంటూనే రూ.19 చెల్లించి తమ సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చుకోవచ్చు.

దేశంలో వచ్చే నెలాఖరు నుంచి మొబైల్ నంబరు పోర్టబిలిటీ (ఎంఎన్‌పి)ని ట్రాయ్ ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు తమకు ఇష్టమైన సర్వీస్ ప్రొవైడర్ నుంచి టెలికాం సేవలు వినియోగించుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న మొబైల్ నంబరును ఇట్టే అట్టిపెట్టుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

అంతేకాకుండా, దేశంలో మొబైల్ ఫోన్ సంస్థల పోటీని ఉధృతం చేస్తూ, కాల్ ఛార్జీలను ఇంకా తగ్గించేందుకు దోహదం చేయగల చర్యగా దీన్ని ట్రాయ్ అభివర్ణిస్తోంది ఒక లైసెన్సుడ్ సర్వీస్ పరిధిలో మొబైల్ టెక్నాలజీ ఏదైనప్పటికీ లేదా ఒక సెల్యూలార్ మొబైల్ టెక్నాలజీ నుంచి అదే ఏక్సెస్ ప్రొవైడర్‌కు సంబంధించిన టెక్నాలజీకి మారినప్పటికీ ఇదే నంబర్‌ను కొనసాగించుకోవచ్చు. జీఎస్‌ఎం నుంచి సీడీఎంఏ.. సీడీఎంఏ నుంచి జీఎస్ఎం సేవలను వినియోగించుకోవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.