ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అక్టోబరులో 16.67 మిలియన్‌ల ఫోన్ కనెక్షన్లు (TRAI | Mobile | Air Tel | Vodafone | TATA | Reliance | BSNL | Aircell)
సెకండ్ పల్స్ బిల్లింగ్ ప్లాన్ ప్రవేశపెట్టడం వల్ల ఒక్క అక్టోబరు నెలలో 16.67 మిలియన్‌ల మంది కొత్త మొబైల్ కనెక్షను పొందినట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. గతంతో పోల్చుకుంటే అక్టోబరు నెలలో రికార్డు స్థాయిలో కనెక్షన్లు పొందినట్టు పేర్కొంది.
జీఎస్ఎం, సీడీఎంఏ, ఎఫ్‌డబ్ల్యూపీలలో కలిపి మొత్తం 16.67 మిలియన్ల కనెక్షన్లను పొందినట్టు ట్రాయ్ పేర్కొంది. దీంతో వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య అక్టోబరు నెలాఖరు నాటికి 488.4 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. ప్రైవేట్ ఆపరేటర్ సెక్టార్‌లో టాటా టెలీ సర్వీసెస్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది.
ఈ కంపెనీ అక్టోబరు నెలలో 3.87 మిలియన్ సబ్‌స్క్రైబర్లను కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో వోడాఫోన్ సంస్థ ఉంది. ఈ సంస్థ మొత్తం 2.98 మిలియన్ కనెక్షన్లను పొందింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికామ్ ఆపరేటింగ్ కంపెనీ అయిన భారతి ఎయిర్‌టెల్ 2.7 మిలియన్ కనెక్షన్లతోనూ, ఎయిర్‌సెల్ 2.02 మిలియన్ సబ్‌స్క్రైబర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దీంతో అక్టోబరు నెలాఖరుకు దేశ వ్యాప్తంగా మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 525.65 మిలియన్లకు చేరుకుంది. సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ సంఖ్య 509.03గా ఉండేది. ప్రతి వంద మందిలో 44.87 శాతం మందికి టెలిఫోన్ సౌకర్యాన్ని పొందుతున్నారు.
అలాగే, బ్రాడ్‌బాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా పెరిగింది. అక్టోబరు నెలఖతో ఈ సంఖ్య 2.49 శాతం పెరిగి 7.4 మిలియన్లుగా ఉంది. సెప్టెంబరు నెలలో ఇది 7.22 మిలియన్‌లుగా ఉండేది.