ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 2009-10 సంవత్సరంలో "బీమా" 15 శాతం వృద్ధి (Life insurance industry | grow | fiscal | Council | economy | Business)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీమా సంస్థ 15 శాతం మేరకు వృద్ధి సాధించనున్నట్టు జీవిత బీమా సంస్థకు చెందిన ఇండస్ట్రీ బాడీ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం ప్రీమియం బీమా ఆదాయం 2.5 లక్షల కోట్లను దాటుతుందని తెలిపింది. ఇందులో కొత్త వ్యాపారంతో పాటు.. రెన్యువల్స్ ఇతర పాలసీలు కూడా ఉన్నట్టు పేర్కొంది.
ఇటీవలి కాలంలో జీవిత బీమాపై దేశ ప్రజల్లో అవగాహన ఎక్కువగా పెరిగిందని ఆ కౌన్సిల్ అభిప్రాయపడింది. ఆర్థికమాంద్యం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మగించినప్పటికీ.. బీమా వ్యాపారం మాత్రం పూర్తి స్థాయిలో జరిగిందని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ఎస్.బి.మాథూర్ తెలిపారు.
భవిష్యత్‌లో కూడా ఇదే తరహా వ్యాపారం జరుగుతుందని తాము ఆశిస్తున్నామని, అందువల్ల ఈ పరిశ్రమ వృద్ధి 15 శాతం మేరకు ఉండవచ్చని తెలిపారు. 2010 ఆర్థిక సంవత్సరంలో 2,55,000 కోట్ల ప్రీమియంను వసూలు చేయాలని నిర్ణయించుకున్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.