సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అమెరికాలో మూతపడ్డ 124 బ్యాంకులు (America | Banks | Florida | Commerce Bank | FDIC | Account Holders)
Feedback Print Bookmark and Share
 
అమెరికాలో నిత్యం బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. గత వారం ఫ్లోరిడాలోనున్న కామర్స్ బ్యాంక్ దివాళా తీసిన తరువాత ఈ ఏడాది మూతపడ్డ బ్యాంకులు 124కు చేరుకున్నాయి.

బ్యాంకు దివాళా తీసిన తర్వాత ఫెడరల్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ (ఎఫ్‌‌డీఐసీ) ఆ బ్యాంక్ ఆస్తిని జప్తు చేసింది. బ్యాంక్ ఖాతాదారులను ఆదుకునేందుకే తాము బ్యాంక్ ఆస్తులను జప్తు చేసామని ఎఫ్‌డీఐసీ వర్గాలు వెల్లడించాయి.

అమెరికాలో దివాళా తీసిన కామర్స్ బ్యాంక్ వద్ద ఆగస్టు 28 నాటి వరకున్న సంపద 7.97 కోట్ల డాలర్ల వరకు ఉండింది. మొత్తం రాశి 7.67 కోట్ల డాలర్లుగా ఉండిందని ఎఫ్‌‌డీఐసీ తెలిపింది. దీంతో తమపై 2.36 కోట్ల డాలర్ల అదనపు భారం పడిందని ఎఫ్‌‌డీఐసీ పేర్కొంది.

దీంతో నవంబర్ నెలలో మూతపడ్డ బ్యాంకులు తొమ్మిదికి చేరుకున్నాయి. ఈ ఏడాది జులై నెలలో దివాళా తీసిన మొత్తం బ్యాంకులు 24కు చేరుకున్నాయి. అదే గత నెల అక్టోబర్‌లో మూతపడ్డ బ్యాంకులు మొత్తం 20గా నమోదైనాయని ఎఫ్‌‌డీఐసీ తెలిపింది.

ఆర్థికమాంద్యం మెరగయ్యే పక్షంలో నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతోంది. దీనికంతటికీ కారణం రుణాలు వసూలు కాకపోవడమేనని, మాంద్యం ప్రభావం చిన్న చిన్న బ్యాంకులపై తీవ్రంగా ఉందని ఎఫ్‌‌డీఐసీ వివరించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.