ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 2050 నాటికి సూపర్ పవర్‌గా భారత్ (INdia | Economy | Super Power | America | International Economic Bulletin | China)
ప్రస్తుతం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధివైపు పయనిస్తోంది. 2050 నాటికి ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదగనుంది.
2050 నాటికి భారతదేశం ఆర్థికంగా సూపర్ పవర్‌గా ఎదగనుందని, జి- 20 దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని ఇంటర్నేషనల్ ఎకనామిక్ బులెటిన్ పేర్కొంది.
అమెరికాతో సమానంగా భారత్, చైనా దేశాలు ఆర్థికంగా అగ్ర దేశాల సరసన చేరుతాయని, 2050నాటికి భారతదేశపు జిడిపి వృద్ధిరేటు 50 రెట్లు పెరుగుతుందని అంతర్జాతీయ ఆర్థిక బులెటిన్ అభిప్రాయపడింది.
ప్రస్తుతం భారత ఆర్థిక జిడిపి 1.1 ట్రిలియన్ అమెరికా డాలర్లుగా ఉంది. ఇది 2050 నాటికి 16 రెట్లు పెరిగి 17.8 ట్రిలియన్ డాలర్లుకు చేరుకుంటుంది. 2009-2050ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ 6.19 శాతం చొప్పన ఎదుగుతుందని ఆ బులెటిన్ పేర్కొంది.