ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికా ఈ గడ్డు పరిస్థితులను నుంచి గట్టెక్కుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయం కూడా లేదని ఈ ఆర్థికవేత్త స్పష్టం చేశారు.
ప్రధాని మాటలు.. ఆర్ధిక మాంద్యం దెబ్బతో విలవిలలాడుతున్న అమెరికాకు ఎంతో ఊరట కలిగించేలా ఉన్నాయి. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన.. అమెరికా శక్తి, ప్రతిష్ట దిగజారుతున్నాయన్న అభిప్రాయాన్ని కొట్టిపారేశారు.
ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తాత్కాలికమేనని ఆయన స్పష్టం చేశారు. వీటి నుంచి త్వరలోనే అమెరికా గట్టెక్కుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.