ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఆర్థిక వృద్ధి ఎనిమిది శాతానికి చేరుకుంటుంది : రంగరాజన్ (Financial Year | Eight percent | Prime Minister Financial Advisory Committee | PMFAC | Economic Crisis | Rangarajan | Chairman | New Delhi | Nine Perc)
ఆర్థిక వృద్ధి ఎనిమిది శాతానికి చేరుకుంటుంది : రంగరాజన్
శనివారం, 2 జనవరి 2010( 14:13 IST )
IFM
వచ్చే ఆర్థిక సంవత్సరం(2010-2011)లో ఆర్థిక వృద్ధి ఎనిమిది శాతానికి చేరుకుంటుందని, ఆ తర్వాత తొమ్మిది శాతానికి ఎగబాకుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆర్థిక వృద్ధి ఏడు నుంచి ఏడున్నర శాతం మధ్యలో ఉంటుందని, అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది శాతానికి చేరుకుంటుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి ఛైర్మెన్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సవంత్సరంలో ఆర్థిక వృద్ధి ఎనిమిది శాతానికి చేరుకోవడంతోపాటు ఒక సంవత్సరం తర్వాత తొమ్మిది శాతానికి చేరుకుంటుందన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకుంటోందని, దీంతోపాటు సాధారణమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో రానున్న రోజుల్లో దేశీయ ఆర్థిక వృద్ధి ఆశాజనకంగానే ఉంటుందన్నారు.
గడచిన 2008-09 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దేశంలో ఆర్థిక వృద్ధి తొమ్మిది శాతం నుంచి తగ్గుముఖం పట్టి 6.7 శాతానికి చేరుకుందని ఆయన వివరించారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం దేశీయ కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు ఇవ్వడం మూలాన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి పెరిగి 7.75 శాతానికి చేరుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గడచిన అక్టోబరు 2008 నుంచి వరుసగా 13 నెలలపాటు ఎగుమతుల్లో తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాంద్యం తగ్గుముఖం పట్టడంతో నవంబర్ నెలలో దేశం నుంచి ఎగుమతైన ఉత్పత్తులలో వృద్ధి సాధించిందన్నారు.