సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 2 శాతం పెరిగిన భారతీ ఎయిర్‌టెల్ షేరు ధర! (Bharti Airtel | BSE | Results | Mumbai | Stock Market)
Bookmark and Share Feedback Print
 
2009-10 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రెండు శాతం పెరిగినట్టు భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్‌లో ఆ కంపెనీ షేర్లు కూడా రెండు శాతం మేరకు లాభపడ్డాయి.

స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే మార్కెట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని, నష్టాలను చవిచూసింది. అయితే, 317 రూపాయలుగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ షేర్ల విలువ 2.37 శాతం పెరిగి 329.80 రూపాయలుగా పలికింది.

దేశంలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో అగ్రగామి సంస్థగా పేర్కొంది ఎయిర్‌టెల్ కంపెనీ ఆదాయం మూడో త్రైమాసికంలో 9772.20 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. గతయేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 9633.4 కోట్లుగా ఉన్నది. ఈ విషయాన్ని ఆ సంస్థ బీఎస్‌ఈకి సమర్పించిన లేఖలో పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.