సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 15.77 శాతం పెరిగిన రిలయన్స్ నికర ఆదాయం (RIL's | Net profit | Rises | Quarters | Business | Mumbai)
Bookmark and Share Feedback Print
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) నికర ఆదాయం ముగిసిన మూడో త్రైమాసికంలో 15.77 శాతం మేరకు పెరిగింది. ఇంత భారీ మొత్తంలో రిల్ ఆదాయం పెరగడం గత ఐదు త్రైమాసికాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. డిసెంబరు 31వ తేదీతో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీ నికర ఆదాయం 4008 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు ఆ సంస్థ పేర్కొంది.

గత యేడాది మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 3462 కోట్ల రూపాయలుగా ఉండేదని, ప్రస్తుతం ఇది 4008 కోట్లకు చేరుకున్నట్టు రిలయన్స్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ త్రైమాసికంలో ప్రతి బ్యారెల్ ముడి చమురుకు 5.9 యూఎస్ డాలర్ల ఆదాయాన్ని అర్జించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.