సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఏపీఐఐసీ ఛైర్మన్‌గా శివరామ సుబ్రహ్మణ్యం! (APIIC | Sivarama Subramanyam | Roasiah | Ministers | Hyd)
Bookmark and Share Feedback Print
 
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా ఎస్.శివరామ సుబ్రహ్మణ్యం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రోశయ్యకు అత్యంత సన్నిహితుడైన సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా వాసి. దీనిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే.

కాగా, ఆయన బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పిల్లి సుభాష్‌చంద్ర బోస్, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పి.విశ్వరూప్, బి.శ్రీనివాస రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

అంతకుముందు ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బి.ఆర్.మీనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జనరల్ మేనేజర్ (పిఆర్) జె.హనుమంత రావు తదితరులు శివరామ సుబ్రహ్మణ్యంను సాదరంగా ఆహ్వానించారు. కాగా, ఈ కార్యక్రమానికి తెలంగాణకు చెందిన మంత్రులెవ్వరూ హాజరుకాక పోవడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.