ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మలేషియా ప్రభుత్వంతో సామ్యా బయోటెక్ ఒప్పందం (Malaysia | Saamya Biotech | Hyderabad | Prime Minister | Finance)
మలేషియా ప్రభుత్వంతో హైదరాబాద్‌కు చెందిన సామ్యా బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. మలేషియాలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకుగానూ ఆ దేశ ప్రధాని మహ్మద్ బిన్ తున్ అబ్దుల్ రజాక్ సమక్షంలో సామ్యా జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ వై. సోనియా రెడ్డి, పరెఖ్ (మలేషియా) ముఖ్యమంత్రి జె. అబ్దుల్ ఖదీర్‌లు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అనువుగా ఉంటుందనే ఉద్దేశంతోనే మలేషియాలో పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సామ్యా బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా పరిశ్రమకు భూములు, పన్ను రాయితీలివ్వడంతో మలేషియా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని సామ్యా బయోటెక్ మేనేజింగ్ డైరక్టర్ మణివర్ధన్ రెడ్డి అన్నారు.
ఇంకా మలేషియాలో ఏర్పాటు కానున్న పరిశ్రమ ద్వారా తమ ఉత్పత్తుల విక్రయం పెరిగే అవకాశం ఉందని మణివర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా తమ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ చేసేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు.