సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » సెప్టెంబరు వరకు చక్కెరపై ఆంక్షలు కొనసాగింపు! (Sugar | Stock | Exports | Imports | Business)
Bookmark and Share Feedback Print
 
దేశ వ్యాప్తంగా చక్కెర ధరలు ఆకాశానికి తాకడంతో కేంద్రం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నిల్వలపై ఉన్న ఆంక్షలను వచ్చే సెప్టెంబరు వరకు పొడగించింది. ఈ అంక్షల పంచదార ఎక్కువగా నిల్వ ఉంచిన వర్తకులు, బ్లాక్‌ మార్కెటీర్లపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా వెసులుబాటు కల్పించింది.

పంచదార నిల్వలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం విధించిన ఉత్తర్వు గడవు మార్చి మొదటి వారం వరకు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ గడువును సెప్టెంబరు వరకు పొడిగించినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఉత్తర్వు ప్రకారం వర్తకుడు తన వద్ద ఉన్న నిర్ధారిత నిల్వలను 30 రోజుల్లో విక్రయించాల్సి ఉంటుంది.

అలాగే, తన వద్ద వ్యాపారానికి విధిగా లైసెన్స్ ఉండాలి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు హెచ్చు నిల్వలు ఉన్నాయన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు కున్నామని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.