సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » టాక్సీ బాడుగ ఇకపై క్రెడిట్ కార్డుతో చెల్లించండి (Mumbai | Bangalore | New Delhi | Hyderabad | Axis Bank | ATM | national capital | Meru radio cabs | Visa | Master Cards | debit/credit cards | Rajesh)
Bookmark and Share Feedback Print
 
సాధారణంగా ప్రయాణాలు చేసేటప్పుడు సరైన చిల్లర ఉండదు. అలాంటప్పుడు కనీసం టాక్సీ బాడుగ చెల్లించేందుకు కూడా డబ్బులు అందుబాటులో ఉండదు, కాని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులుంటాయి. వాటిని టాక్సీ డ్రైవర్లకివ్వలేముకదా. అందుకే దేశ రాజధానిలోనున్న మేరు రేడియో క్యాబ్స్ సంస్థ వినూత్న పథకాన్ని రూపొందించింది. అదేంటంటే టాక్సీ బాడుగను క్రెడిట్ కార్డుతో చెల్లించే వెసలుబాటును సదరు సంస్థ అందిస్తోంది. దీనికి ఈ సంస్థ యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది.

ప్రధానంగా దేశ రాజధానికి ఎన్నో పనుల నిమిత్తం ప్రజలు ప్రతి రోజు వస్తూ, పోతూవుంటారు. ఒకానొక సందర్భంలో టాక్సీ బాడుగ చెల్లించేందుకు డబ్బులుండవు. దీంతో మీవద్దనున్న క్రెడిట్ కార్డును ఎంచక్కా ఉపయోగించుకోవచ్చంటున్నారు మేరు రేడియో క్యాబ్స్ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాజేశ్ పురి తెలిపారు.

ప్రస్తుతం ఇలాంటి సౌకర్యాన్ని కేవలం దేశ రాజధానిలో మాత్రమే అమలులోకి తీసుకువస్తున్నామని, క్రెడిట్ కార్డు కలిగిన వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. తాము యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తాము ఒప్పందం చేసుకున్న మేరకు విసా, మాస్టర్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు.

ఇలాంటి ప్లాస్టిక్ మనీని తమ వినియోగదారులు సునాయాసంగా వినియోగించుకోవచ్చని, దీంతో చేతిలో డబ్బులు తీసుకువెళ్ళే అవసరం ఉండదని సంస్థ తెలిపింది. తాము ఏర్పాటు చేసిన ఈ సౌకర్యంతో ఏటిఎంల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదన్నారు. తమ క్యాబ్లలోనే క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగదారులే స్వయంగా ఉపయోగించుకోవచ్చని, దీంతో తమ వినియోగదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సంస్థ తన సర్వీసులను దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ నగరాలలో అందజేస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.