ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra | online share trading facility | MAHA e-trade service | Bank's customers | February | Religare Securities | Enam Securities)
ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
మంగళవారం, 9 ఫిబ్రవరి 2010( 20:36 IST )
FILE
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహా ఈ-ట్రేడ్ సేవలను ప్రారంభించింది.
షేర్ మార్కెట్ వినియోగదారుల సౌకర్యార్థం తమ బ్యాంకు మహా ఈ- ట్రేడ్ సేవలను సోమవారం నుంచి ప్రారంభించినట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రతినిధి మంగళవారం మీడియాకు వెల్లడించారు. తాము అందించే ఈ -ట్రేడ్ సేవలను తమ బ్యాంకు వినియోగదారులతోపాటు ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా తమ బ్యాంకు రెలిగర్ సెక్యూరిటీస్, ఈనం సెక్యూరిటీస్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు ఆ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. తమ ఒప్పందం మేరకు తమ వినియోగదారులకు మరిన్ని సేవలను అందించేందుకు అవకాశం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.