ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » రూ. 110 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించుకున్న ఆర్ఏడీఏజీ (RADAG | Relaince Webstore | Telecome sector | Services | Director | Swaroop chowdhari)
రూ. 110 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించుకున్న ఆర్ఏడీఏజీ
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2010( 13:50 IST )
రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ సమూహానికి చెందిన (ఆర్‌ఏడీఏజీ)రిలయన్స్ వెబ్‌స్టోర్ ద్వారా టెలికాం రంగంతో ముడిపడివున్న సేవలను వినియోగదారులకే నేరుగా విక్రయించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో భాగంగా నూటపది కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
తమ సంస్థలో భాగమైన రిలయన్స్ వెబ్‌స్టోర్ లిమిటెడ్ ద్వారా టెలికాం ఉత్పత్తులు, సేవలను నేరుగా వినియోగదారులకే అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని, ఇందులో భాగంగా 110 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలమని రిలయన్స్ వెబ్‌స్టోర్ లిమిటెడ్ డైరెక్టర్, ప్రధాన కార్యనిర్వహణాధికారి స్వరూప్ చౌధరీ మీడియాకు తెలిపారు.
ప్రత్యక్ష సేవల ద్వారా వినియోగదారులకు తమ టెలికాం ఉత్పత్తులు, సేవలను అందించేందుకు వీలుగా దేశవ్యాప్తంగానున్న వంద షోరూంలలో ప్రత్యక్ష అమ్మకాల ఛానెల్‌ను ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తమ సంస్థకు 234 రిలయన్స్ వరల్డ్ స్టోర్‌లున్నాయని ఆయన చెప్పారు.
తమ ప్రణాళికలో భాగంగా దాదాపు 110 కోట్ల రూపాయల ఆదాయాన్ని సముపార్జించుకోనున్నామని, ఇందులో ఇరవై శాతం మొబైల్ హ్యాండ్‌సెట్ల అమ్మకాల ద్వారా సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.