గృహోపకరణాల వస్తు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా పేరొందిన ప్రీతి మిక్సీ తాజాగా మార్కెట్‌లోకి సరికొత్త ప్రీతి మ్యాజిక్ మిక్సర్‌ను ప్రవేశపెట్టింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మిక్సీని మార్కెట్‌లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆ సంస్థ ఆపరేషన్స్ విభాగం డైరక్టర్ టీటీ.సిద్ధార్థ్ మాట్లాడుతూ.. మాయా అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రీతి పేరు మీద వివిధ రకాల గృహోపకరణ వస్తువులు తయారు చేస్తున్నట్టు చెప్పారు.
ఇందులో మిక్సీ, గ్రైండర్, కాఫీ మేకర్, ఆటోకుక్కర్ తదితర వస్తువులు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు మరింత సౌలభ్యంగా ఉండేందుకు వీలుగా ప్రీతి మేజిక్ మిక్సీని మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు తెలిపారు. కూరగాయలను కత్తిరించే విధంగా సలాడ్ మిక్సర్ ఇందులో ఉన్నట్టు చెప్పారు.
750 వాట్ మోటార్ సామర్థ్యం కలిగిన మిక్సర్‌గా ఆయన వివరించారు. కూరగాయలను ముక్కలుగా చేసేందుకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. అలాగే, జ్యూస్ తీయడం, భద్రపరచడం వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉన్నట్టు ఆయన వివరించారు.
తమ సంస్థకు దేశ వ్యాప్తంగా 90 లక్షల మంది వినియోగదారులు ఉన్నట్టు చెప్పారు. అలాగే ఏడు వేల మంది డీలర్లు, 400 గుర్తింపు పొందిన సర్వీసు సెంటర్లు, 70 బ్రాంచ్‌లు ఉన్నట్టు వివరించారు.