సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పది శాతానికి చేరుకోనున్న ద్రవ్యోల్బణం: అస్సోచెమ్ (Inflation | double-digits | March | Assocham | January | rainfall | monsoon season | food grains | production)
Bookmark and Share Feedback Print
 
FILE
దేశీయ ద్రవ్యోల్బణం నిదానంగా రెండంకెల పరిధిలోకి ప్రవేశించి పది శాతానికి చేరుకుంటుందని అస్సోచెమ్ వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశీయ ద్రవ్యోల్బణం రెండంకెల పరిధిలోకి ప్రవేశించి పది శాతానికి చేరుకుంటుందని, దీనికి ప్రధాన కారణం దేశంలో ఆహారోత్పత్తులు తగ్గడమేనని అస్సోచెమ్ పేర్కొంది.

దేశంలో ఆహారోత్పత్తులు తగ్గడం, కరువు, అతివృష్టి కారణంగా పంటలు నాశనమైనాయని, దీంతో దేశీయ ద్రవ్యోల్బణం రెండింతలు పెరిగి పది శాతానికి చేరుకుంటుందని అస్సోచెమ్ వర్గాలు వెల్లడించాయి. ఇదే ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతానికి చేరుకోగలదని అస్సోచెమ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేసాయి.

దేశంలో తక్కువ వర్షపాతం నమోదుకావడంతోపాటు పండిన పంటలు చేతికి అందలేకపోవడం ప్రధాన కారణమని, రుతువులు సరిగా లేకపోవడంతో ఆహారోత్పత్తులు సరిగా రాలేదని, దీంతోనే ద్రవ్యోల్బణం పెరిగినట్లు అస్సోచెమ్ వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా డాలరుతో రూపాయి విలువ 42-43 పైసలకు చేరుకోగలదని అస్సోచెమ్ ఆశాభావం వ్యక్తం చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.