ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి భారత్-బంగ్లా ఒప్పందం! (India | Bangladesh | Power plant | Khulna | Agreement | Business)
విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి భారత్-బంగ్లా ఒప్పందం!
శనివారం, 20 ఫిబ్రవరి 2010( 18:08 IST )
సౌత్‌వెస్ట్రన్ బంగ్లాదేశ్‌లో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారా 1320 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. సౌత్‌వెస్ట్రన్ బంగ్లాదేశ్‌లోని ఖుల్నా అనే ప్రాంతంలో ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతారు.
ఈ మేరకు భారత్-బంగ్లాదేశ్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఒప్పందం కుదిరింది. అలాగే, భారత్ నుంచి 250 మెగావాట్‌ల విద్యుత్‌ను బంగ్లాదేశ్ కొనుగోలు చేయనుంది. కాగా, ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర విద్యుత్ శాఖామంత్రి హెచ్.ఎస్.బ్రహ్మా, బంగ్లాదేశ్ ప్రతినిధి అబ్దుల్ కలామ్ అజాద్ నేతృత్వంలోని అధికారుల బృందం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం మేరకు భారత్ నుంచి కొనుగోలు చేసే 250 మెగావాట్లల విద్యుత్‌లో ఒక యూనిట్‌ను రెండు రూపాయల చొప్పున వచ్చే 35 సంవత్సరాల పాటు బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తుంది. ఈ యూనిట్ ధరను ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీ ఖరారు చేసింది.