సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఆర్థికమాంద్యం: అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగం! (America | Un employment | Labour | Business | Financial Cricis)
Bookmark and Share Feedback Print
 
ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచ దేశాలు మెల్లగా కోలుకుంటున్నాయి. ఈ మాద్యంలో చిక్కుకున్న అమెరికాలో మాత్రం నిరుద్యోగం పెరిగిపోతోంది. ఫిబ్రవరి 13వ తేదీతో ముగిసిన వారంలో నిరుద్యోగులకు అందించే ప్రయోజనాలను కోరే అమెరికన్ల సంఖ్య 31,000 పెరిగి 4,73,000కు చేరింది.

అమెరికాలో కార్మిక మార్కెట్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదనే ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. అమెరికా కార్మిక శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో సీజనల్‌గా సర్దుబాటు చేసిన ముందస్తు గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 13వ తేదీతో ముగిసిన వారంలో క్లెయిముల సంఖ్య 4,73,000లకు చేరింది. ఇది అంతకు ముందు వారపు సవరింపబడిన 4,42,000 కన్నా 31,000 అధికమని పేర్కొంది.

ఆర్థిక సంక్షోభం దెబ్బకు కుదేలైన కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడంతో దేశంలో లక్షలాది మంది నిరుద్యోగులయ్యారు. కాగా నిరుద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజ నాలను ఆశించే వారి సంఖ్య మొత్తం ఫిబ్రవరి 6వ తేదీతో ముగిసిన వారానికి 45,63,000కు చేరిందని కార్మిక శాఖ పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.