సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » బడ్జెట్ దెబ్బ: డీజిల్ రూ.2.85, పెట్రోలు రూ. 2.67 పెంపు (FM | Pranab Mukherjee | Union Budget | fuel prices | Kirit Parikh Committee)
Bookmark and Share Feedback Print
 
FILE
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో శుక్రవారం సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కిరీట్ పారిఖ్ కమిటీ సూచన మేరకు పెట్రోలు ధరలు పెంచక తప్పడంలేదన్నారు. దీంతో ప్రతి లీటరు పెట్రోలు ధర రూ. 2.67లు, ప్రతి లీటరు డీజిల్ ధర రూ. 2.58ల మేరకు పెరగనుంది. పెరిగిన ఈ ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే అమలౌతాయని ఆయిన ప్రకటించారు.

పెట్రోలు, కస్టమ్స్ సుంకాన్ని 2.5 శాతం నుంచి 7.5 శాతం మేరకు పెంచడంతో ప్రతి లీటరు పెట్రోలు ధర రూ. 2.67లకు చేరుకుంది. అదే ప్రతి లీటరు డీజిల్ ధర రూ. 2.58లకు చేరుకుంది. ఢిల్లీలో ప్రస్తుతం ప్రతి లీటరు పెట్రోలు ధర రూ. 44.72, డీజిల్ ప్రతి లీటరు ధర రూ. 32.92లుగా ఉంది.

పారిఖ్ కమిటీ సూచన మేరకు ముడి చమురుపై దిగుమతి సుంకాన్ని 5 శాతం మేర పెంచేందుకు నిర్ణయించారు. ఈ ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ ఆయిల్ కంపెనీలపై తీవ్రమైన ప్రభావం పడనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.