ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మార్చి తర్వాత పెరగనున్న ఉక్కు ధరలు : టాటా స్టీల్స్ (FY | April | Steel | Price | Tata stell | Amitabh Panda)
మార్చి తర్వాత పెరగనున్న ఉక్కు ధరలు : టాటా స్టీల్స్
బుధవారం, 10 మార్చి 2010( 19:12 IST )
వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో ఉక్కు ధరలు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. దేశంలో ఉక్కు ఉత్పత్తుల్లో తగ్గుదల కనబడుతుండంతోపాటు మార్కెట్‌లో ఉక్కుకు మరింత డిమాండ్ పెరుగుతోంది. దీంతో మార్చి నెల తర్వాత ఉక్కు ధరలు పెరగనున్నాయని ఉక్కు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకన్నా వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఉక్కు ధరలు దాదాపు 25 నుంచి 30 శాతం మేరకు పెరిగే అవకాశాలున్నాయని టాటా స్టీల్ విక్రయ విభాగానికి చెందిన ప్రతినిధి అమితాబ్ పాండా అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఉక్కు ధరలు పెరిగే సూచనలున్నాయన్నారు. దేశంలో ఉక్కు ఉత్పత్తుల్లో తగ్గుదల కనపడటంతోపాటు మార్కెట్లో ఉక్కు, ముడి ఇనుము ధరలకు మంచి డిమాండ్ ఏర్పడిందని దీంతో వాటి ధరలు దాదాపు 25 నుంచి 30 శాతం మేరకు పెరిగే అవకాశాలున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆర్థిక మాంద్యం కారణంగా పశ్చిమ దేశాలలోని ఉక్కు పరిశ్రమలు ఇంకా కోలుకోలేదని ఆయన అన్నారు. అదే భారతదేశంలో ఉక్కుకు మంచి డిమాండ్ ఏర్పడుతోందన్నారు. దీంతో దేశీయ ఉక్కు పరిశ్రమలు ఉత్పత్తుల్లో పెరిగే ఖర్చును వినియోగదారులపై వేయకతప్పడం లేదన్నారు.