ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మార్కెట్లో కోడిగుడ్లు ధరలు (Farmgate I market I rates I Eggs I Hyderabad I Chennai I Namakkal I Vijayawada)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో బుధవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.227గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.50గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.228గాను, విజయవాడలో రూ.229, విశాఖపట్నంలో రూ.240, గోదావరి మార్కెట్‌లో రూ.229, తూర్పుగోదావరిలో రూ.229, చిత్తూరులో 244 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.251 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 245 రూపాయలుగా పలుకుతోంది.