సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » నూతన శాఖలను ప్రారంభించిన సిండికేట్ బ్యాంక్ (Karnataka | Syndicate Bank | branches | country | Manipal | Executive Director | V K Nagar)
Bookmark and Share Feedback Print
 
దేశీయ బ్యాంకింగ్ రంగంలో తనకంటూ వ్యాపార స్థానాన్ని ఏర్పరచుకున్న కర్నాటకకు చెందిన సిండికేట్ బ్యాంకు దేశంలో మరో యాభై శాఖలను గురువారం ప్రారంభించింది.

తమ బ్యాంకుకు చెందిన పలు శాఖలను దేశవ్యాప్తంగా మరో యాభై శాఖలను ప్రారంభించినట్లు సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి కే నగర్ గురువారం తెలిపారు. నూతన శాఖలను ముంబైలో ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన యాభై శాఖలలో కూడా నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసామని, తమ బ్యాంకులకు చెందిన దేశవ్యాప్తంగానున్న అన్ని శాఖలను నెట్‌వర్క్‌‍‌తో మణిపాల్‌లోని ప్రధాన శాఖకు అనుసంధానం చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా తమ బ్యాంకుకు 2,300 శాఖలున్నాయని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా ఈ బ్యాంకుకు సంబంధించిన నూతన శాఖలలో నాలుగు శాఖలను ముంబై నుంచే ఈ-ప్రారంభంతో బ్యాంకుల శాఖల కార్యకలాపాలను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా రానున్న రోజుల్లో తమ బ్యాంకుకు చెందిన ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు తమ బ్యాంకు యాజమాన్యం కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.