సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » స్టీల్ ప్లాంట్‌ను ప్రారంభించనున్న సూర్యా రోషిని (Surya Roshni | Lighting products | Karnataka | Utkarsh Dwivedi | Cement | Power | PVC pipes | Gujarat | Madhya Pradesh | Chattisgarh | Uttarakhand | G)
Bookmark and Share Feedback Print
 
విద్యుత్ బల్బుల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న సూర్యా రోషిని సంస్థ కర్నాటకలో కొత్తగా స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

దేశీయ విద్యుత్ బల్బుల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న సూర్యా రోషిని సంస్థ కర్నాటక రాష్ట్రంలో నూతనంగా స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుందని సూర్యా రోషిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్కర్ష్ ద్వివేదీ గురువారం జమ్మూలో మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా కర్నాటకలో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్‌లో ప్రతి సంవత్సరం 50 లక్షల యూనిట్లను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు.

ప్రస్తుతం అక్కడ పనులు నిర్మాణ దశలోనున్నాయని, దీనికి సంబంధించిన పెట్టుబడి తదితర అంశాలపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. స్టీల్ ప్లాంట్ కర్మాగారంతోపాటుగా దశలవారీగా సిమెంట్, విద్యుచ్ఛక్తి, పివిసి పైపుల కర్మాగారాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు. ఈ రంగాలకు చెందిన కంపెనీలను తాము గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రారంభించునున్నామన్నారు.

అత్యంత ఎక్కువ వెలుతురునిచ్చే వీధి దీపాలను కూడా గ్వాలియర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని తమ కర్మాగారాల్లో తయారు చేయనున్నామని ఆయన వెల్లడించారు. దీంతో మరో ఆరువేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనున్నామని ఆయన తెలిపారు. అలాగే పరోక్షంగా మరో రెండు నుంచి మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.