రాజు బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
సోమవారం, 15 మార్చి 2010( 14:55 IST )
FILE
సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.
సత్యం కంప్యూటర్స్ సంస్థలో నిరుడు జనవరిన దాదాపు పది వేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేశారు. అతని బెయిల్ పిటీషన్‌ను సోమవారం ధర్మాసనం తిరస్కరించింది. హృద్రోగ సంబంధిత వ్యాధితోపాటు పలు ఆరోగ్య సమస్యలతో భాధపడుతున్నానని, మెరుగైన వైద్య సేవల కోసం బెయిల్ ఇప్పించాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన పిటీషన్‌ను విచారించిన ధర్మాసనం సోమవారం తిరస్కరించింది.
ఇదిలావుండగా కోర్టు విధించే షరతులకు తాను కట్టుబడివుంటానని రామలింగరాజు ఆ పిటీషన్‌లో స్పష్టం చేశారు. కాగా ఆరోగ్య కారణాల రీత్యా అతనికి బెయిల్ మంజూరు చేయకూడదని సిబిఐ కోర్టుకు విన్నవించింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని సిబిఐ సుప్రీం కోర్టుకు వివరించిది. దీంతో రామలింగరాజు సుప్రీం కోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.