ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఆర్థిక వృద్ధితోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతుంది: అరుణ్ (Arun Jaitley, BJP, NHWAI, Inflation, February, Budget)
ఆర్థిక వృద్ధితోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతుంది: అరుణ్
సోమవారం, 15 మార్చి 2010( 18:22 IST )
FILE
దేశీయ ఆర్థిక వృద్ధి పెరుగుతుంది కాని దీంతోపాటు ద్రవ్యోల్బణం కూడా అదే మాదిరి పెరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
దేశీయ ఆర్థిక వృద్ధి ఖచ్చితంగా పెరుగుతుంది. కాని దీంతోపాటు ద్రవ్యోల్బణం కూడా రెండంకెల వృద్ధికి చేరుకుంటుందని రాజ్యసభ ప్రతిపక్ష సభ్యుడైన అరుణ్ జైట్లీ సభలో సోమవారం ఎద్దేవా చేశారు. రాజ్యసభలో సాధారణ బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వృద్ధి పెరుగుతుందన్న మాట మాత్రం వాస్తవమే, కాని ఈ పెరుగుదల సాధారణ బడ్జెట్‌తో మాత్రం కాదని ఆయన అన్నారు.
ఆర్థిక వృద్ధి పెరగడంతోపాటు ద్రవ్యోల్బణం కూడా రెండంకెలకు చేరుకుంటుందని, ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన ఫిబ్రవరి మాసపు ద్రవ్యోల్బణం రేటు 9.89 శాతానికి చేరుకుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సామాన్య ప్రజలు, జీతాలపై ఆధారపడ్డ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. టోకు ధరలతో ఆధారపడ్డ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో వృద్ధి జరిగిందన్నారు.
జీతాలు పొందే ప్రజల నుండి పన్ను వసూలు చేసే విధానంలో మార్పులు చేయాల్సి అవసరం ఉందని తాను సభాముఖంగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరుతున్నానన్నారు. ఎవరైతే మౌలిక సదుపాయాల రంగంలో పని చేస్తున్నారో, ముఖ్యంగా జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా విభాగంలో పనిచేసేవారిపై తీవ్రమైన భారం పడిందని ఆయన ఆరోపించారు.