సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పెరిగిన విమాన ఛార్జీలతో తగ్గిన ప్రయాణీకుల సంఖ్య (Flight | Charges | Passengers | February | Airline indigo | Spicejet | ATF)
Bookmark and Share Feedback Print
 
FILE
ధరల పెరుగుదల ప్రభావం విమానయాన ప్రయాణీకులపై కూడా పడుతోంది. పెరిగిన విమానయాన ఛార్జీల కారణంగా ఫిబ్రవరి నెలలో విమానయాన ప్రయాణీకుల సంఖ్య తగ్గి 38.63 లక్షలకు చేరుకుంది. అదే జనవరి నెలలో 40.87 లక్షలుగా ఉండిందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నెసిల్) మినహా దేశీయ విమానయాన సంస్థలైన ఎయిర్‌లైనో ఇండిగో, పారామౌంట్, స్పైస్‌జెట్ సంస్థలలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా ద్వారా 6.63 లక్షల ప్రయాణీకులు ప్రయాణం చేయగా జెట్ ఎయిర్‌వేస్ ద్వారా 7.26 లక్షల మంది, కింగ్‌ఫిషర్ ద్వారా 8.77 లక్షల మంది, స్పైస్‌జెట్ ద్వారా 4.65 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణం చేశారు.

ఇదిలావుండగా అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రభావం కారణంగా ప్రభుత్వ చమురు కంపెనీలు విమాన ఇంధన ధరలను దాదాపు 2.44 శాతం పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించాయి. దీంతో మార్చి నెలలో కొనుగోలు చేయాల్సిన ఇంధన ధరలను పెంచడం ఇది రెండవసారి. విమాన ఇంధన ధరలు పెరగడంతో ఢిల్లీలో ఏటీఎఫ్ ప్రతి కిలో లీటరుపై రూ. 961లు పెరిగి రూ. 40,268లకు చేరుకుంది. అదే ముంబైలో ప్రస్తుతం ప్రతి కిలో లీటరు ధర రూ. 41,561లుగా ఉంది. పెరిగిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలయ్యాయి.

విమాన ఇంధన ధరలు పెరగడంతో పలు విమానయాన కంపెనీలపై తీవ్రమైన ప్రభావం పడింది. దీంతో ప్రయాణీకులపై ఛార్జీల మోత తప్పేటట్లు లేదు. పైగా ప్రయాణ ఛార్జీలు పెరగటంతో ప్రయాణీకుల సంఖ్య ఏమాత్రం ఉంటుందనేది పలు విమానయాన కంపెనీల్లో గుబులు రేకెత్తిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.