సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » బిగ్ ఎఫ్ఎమ్‌లో రిలయన్స్ మీడియా క్లాసిఫైడ్ యాడ్స్ (Reliance Media World | Anil Ambani | BIG 92.7 FM | Classified ads | BSE)
Bookmark and Share Feedback Print
 
వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన రిలయన్స్ మీడియా వరల్డ్ తన 92.7 ఎఫ్ఎమ్ రేడియోలో క్లాసిఫైడ్ యాడ్ విభాగాన్ని మంగళవారం ప్రారంభించింది.

ఈ సందర్భంగా రిలయన్స్ మీడియా వరల్డ్ అధికారులు మాట్లాడుతూ... తమ సంస్థకు చెందిన బిగ్ 92.7 ఎఫ్ఎమ్ రేడియోలో క్లాసిఫైడ్ ప్రకటనల విభాగాన్ని మంగళవారం ప్రారంభించామన్నారు. ఈ విషయాన్ని బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపామన్నారు.

బిగ్ ఎఫ్ఎమ్ రేడియో ద్వారా ప్రకటనలు ఇవ్వదలచినవారికోసం ఈ సదుపాయాన్ని తొలిసారిగా తామే కల్పించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సదుపాయం ద్వారా ప్రకటనకర్తలు తమ వస్తువులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే వీలు కలిగిందని రిలయన్స్ మీడియా వరల్డ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఎఫ్ఎమ్ రేడియో ప్రపంచంలో మంచి పోటీతత్వం నెలకొని ఉన్నదనీ, దీనిని అధిగమించేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తోందని తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.