సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పది కోట్లకు చేరుకున్న ఆర్‌కాం వినియోగదారులు (RCOM | India | telecom operator | subscriber | Bharti Airtel | Vodafone | BSNL | Anil Ambani | ADAG | TRAI)
Bookmark and Share Feedback Print
 
దేశీయ ప్రైవేట్ టెలికాం రంగంలో అగ్రగామిగానున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన వినియోగదారుల సంఖ్య పది కోట్లకు చేరుకుంది. భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం రంగంలో ద్వితీయ స్థానంలోనున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కాం) సంస్థలో జనవరి చివరి నాటికి 9.65 కోట్ల వినియోగదారులు ఆర్‌కాం సేవలను పొందుతున్నారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.

ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం 2009, మే 15 నాటికి జీఎస్ఎమ్ ఆపరేటర్, టెలికాం దిగ్గజం అయిన భారతీ ఎయిర్‌టెల్ సంస్థ పది కోట్ల మంది వినియోగదారులను చేర్చుకుని రికార్డు సృష్టించింది. దీంతో ఏకైక దేశీయ మొబైల్ సర్వీసెస్ ఆపరేటర్‌గా నిలిచింది. ప్రపంచంలోనే దేశీయ ఇంటిగ్రేటెడ్ టెలికాం ఆపరేటర్‌గా ఆరవ స్థానంలో నిలిచిందని ట్రాయ్ తెలిపింది.

ఆర్‌కాం సంస్థ 2003లో ప్యాన్-ఇండియా పథకాన్ని ప్రారంభించింది. అదే ఎయిర్‌టెల్ సంస్థ ప్యాన్-ఇండియా పథకాన్ని 2005లో ప్రారంభించింది. ఇందులో భాగంగా అస్సోం, ఈశాన్య రాష్ట్రాలలోని 21 సర్కిల్స్‌లో తన నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ప్రస్తుత ఏడాది జనవరి చివరి నాటికి భారతీ ఎయిర్‌టెల్ సంస్థకు 121.71 మిలియన్ వినియోగదారులు, ఆర్‌‍కాం సంస్థకు 96.59 మిలియన్ల వినియోగదారులు, వోడాఫోన్ 94.14 మిలియన్లు, బిఎస్ఎన్ఎల్ 65.10 మిలియన్లు, టాటా 60.31 మిలియన్లు, ఐడియా 59.88 మిలియన్ల వినియోగదారులు నమోదైనట్లు ట్రాయ్ తెలిపింది.

ఆర్‌కామ్ కేవలం గత 43 రోజుల్లోనే 3.41 మిలియన్ల వినియోగదారులను నమోదు చేసుకుంది. దీంతో మార్చి నెల 15 నాటికి వంద మిలియన్ల వినియోగదారులను తన ఖాతాలో జమ చేసుకుంది. అతి కొద్ది కాలంలోనే తమ సంస్థ సిడిఎమ్ఎ, జిఎస్ఎమ్ మొబైల్ సర్వీసుల్లో ప్రత్యేక రాయితీలు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకుని వంద మిలియన్లకు చేరుకుందని అడాగ్ ఛైర్మెన్ అనిల్ అంబానీ ఓ ప్రకటనలో తెలిపారు. తక్కువ కాలంలో వంద మిలియన్ల మంది వినియోగదారులను ఆకర్షించటం ద్వారా తమ సంస్థ మరింత దృఢంగా మారిందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

దేశంలోని మొబైల్ రంగంలో రిలయన్స్ కమ్యునికేషన్స్ సంస్థ తొలినుంచి పలు విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. తాము రెండు వందల మంది వినియోగదారులను చేర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని, ఇది త్వరలోనే సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తామన్నారు.

దీంతో ప్రపంచంలోనే ఏకైక టెలికాం ఆపరేటర్ల సంస్థల్లో ఆర్‌కాం సంస్థ నాల్గవ స్థానానికి చేరుకుంది. రానున్న మరో వెయ్యి రోజుల్లో రెండు వందల మిలియన్ల వినియోగదారులను తమ సంస్థలో సభ్యులుగా చేర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. రెండు వందల మిలియన్ల వినియోగదారులను చేర్చుకునే లక్ష్యాన్ని చేరుకునేందుకు తమ సంస్థకు చెందిన జీఎస్ఎమ్ నెట్‌వర్క్, సిడిఎమ్ఎ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ల ద్వారా వినియోగదారులతో సత్సంబంధాలను కొనసాగించి మరింత విస్తారంగా వినియోగదారులను చేర్చుకుంటామని ఆయన అన్నారు. దీంతోపాటు తమ వినియోగదారుల అనుభవాలను కూడా తెలుసుకుని వారికి అనుగుణంగా తమ సేవలను అందిస్తామన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.