ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరొచ్చు: ప్రణబ్ (Inflation | FM | Pranab Mukherjee | March | General Budget 2010-11 | Rajya Sabha)
టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం మార్చి నెలలోనే రెండంకెలకు చేరే అవకాశముందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం రాజ్యసభలో తెలిపారు.
దేశంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిందని, ఇది ఈ నెలలోనే రెండంకెలకు చేరుకునే సూచనలు కనపడుతున్నాయని మంత్రి ప్రణబ్ రాజ్యసభలో మంగళవారం వెల్లడించారు. 2010-11 బడ్జెట్‌పై చర్చలో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్‌పై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
మార్చిలోనే ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరితే నేనేమీ ఆశ్చర్యపోనని ఆయన అన్నారు.ఎందుకంటే ఫిబ్రవరి నెలలోనే ద్రవ్యోల్బణం 9.89 శాతానికి చేరుకుందని, నిరుడు ఇదే కాలానికి ఈ సమయంలో ఉన్న ద్రవ్యోల్బణం ప్రతికూల ప్రభావం ప్రస్తుతం కూడా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరం జూన్‌వరకు ఇలాగే కొనసాగ వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.