స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో పెట్టుబడుల ఉపసంహరణకు అన్ని కార్మిక సంఘాల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఏ.సాయి ప్రతాప్ వెల్లడించారు.
సెయిల్ కంపెనీకి చెందిన షేర్లలో 20 శాతం షేర్లను 16000 కోట్ల రూపాయలకు విక్రయించాలని వచ్చే అక్టోబరు-నవంబరు నెలల్లో విక్రయించాలని తొలుత భావించారు. ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రాజ్యసభలో మంత్రి సాయి ప్రతాప్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. సెయిల్‌లో పెట్టుబడుల ఉప సంహరణకు అన్ని రకాల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.