సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అమెరికాలో మూతపడిన మరో ఐదు బ్యాంకులు! (US bank | failures | shut | America | Washington | Business)
Bookmark and Share Feedback Print
 
ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి అమెరికా బ్యాంకులు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. శుక్రవారం మరో ఐదు బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు మూతపడిన బ్యాంకుల సంఖ్య 108కు చేరుకుంది. మూత పడిన ఐదు బ్యాంకులు వాయువ్య, నైరుతి అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి.

మూత పడిన బ్యాంకుల జాబితాలో ఆరిగాన్‌లోని లిబర్టీ బ్యాంక్ ఆఫ్ ఈజెనీ, వాషింగ్టన్‌లోని ది కౌలిట్జ్ బ్యాంక్ ఆఫ్ లాంగ్వీ, ఫ్లోరిడా కేంద్రంగా పని చేసే కోస్టల్ కమ్యూనిటీ బ్యాంకు ఆఫ్ పనామా సిటీ బ్రాంచ్, జార్జియాలోని నార్త్‌వెస్ట్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ ఆఫ్ అక్వార్త్, ఫ్లోరిడాలోని సేవింగ్స్ బ్యాంక్ ఆఫ్ పోర్ట్ సెయింట్ జోయ్‌లు ఉన్నట్టు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వివరించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.